logo

టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

దర్శకత్వం: మల్లిక్ రామ్ నటీనటులు: నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రిన్స్, మురళీధర్ గౌడ్ తదితరులు

సమర్పణ: శ్రీకర స్టూడియోస్

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్

సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

రిలీజ్ డేట్: 2024-03-29
డీజే వాయించడంలో బ్రాండ్‌గా మారిన డీజే టిల్లు అలియాస్ బాలగంగాధర్ తిలక్ తన ఫ్యామిలీతో కలిసి టిల్లు ఈవెంట్ పేరుతో వెడ్డింగ్, ఇతర ఈవెంట్లను నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో గుర్తు తెలియన వ్యక్తి నుంచి 25 లక్షల రెమ్యునరేషన్‌తో భారీ ఈవెంట్‌ను చేజిక్కించుకొంటాడు. ఆ తర్వాత ఓ పబ్‌లో ఊహించని పరిస్థితుల్లో టిల్లు జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) వస్తుంది.

గుర్తు తెలియని వ్యక్తి కోసం చేయనున్న ఈవెంట్ అతడి జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది. తన జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) వచ్చిన తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది. లిల్లీ ప్రెగ్నెన్సీకి కారణమేంటి? ఎలాంటి పరిస్థితుల్లో మళ్లీ టిల్లు జీవితంలోకి రాధిక (నేహాశెట్టి) ఎలా వచ్చింది? జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్‌ను టిల్లు పూర్తి చేశాడా? ప్రతికూల పరిస్థితుల నుంచి టిల్లు ఎలా బయటపడ్డారనేది టిల్లు స్క్వేర్ సినిమా కథ. డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి కారణమైన స్క్రీన్ ప్లేతోనే టిల్లు స్క్వేర్ సినిమాను మొదలుపెట్టినప్పటికీ..కొత్త కొత్త సీన్లు, డైలాగ్స్‌తో మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ మల్లిక్ రామ్ అనుసరించిన పంథా బాగుంది. కథ, కథనం, సీన్ల విషయంలో ఎలాంటి ప్రయోగం చేయకుండా చాలా బ్యాలెన్స్, పకడ్బందీగా ప్లాన్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అత్యంత బలంగా మారడమే కాకుండా సాధారణ ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించేలా చేసిందని చెప్పవచ్చు.

ఇక ఫస్టాఫ్ డీజే టిల్లు ఫార్మాట్‌ను అనుసరించిన టీమ్.. సెకండాఫ్‌లో కథలోకి డాన్ (మురళీ శర్మ)ను పట్టుకొచ్చి.. క్రైమ్ డ్రామాను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు నడిపించారు. ఐకానిక్ క్యారెక్టర్ రాధిక రోల్‌తో నేహా శెట్టి క్యారెక్టర్‌ను మళ్లీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక అనుపమ పరమేశ్వరన్‌ను కేవలం గ్లామర్ రోల్ కాకుండా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేయడం మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పకోవచ్చు. క్లైమాక్‌ను డీల్ చేసిన విధానం సిద్దూ, మల్లీక్, టీమ్ వర్క్‌కు అద్దం పట్టింది. ఎప్పటిలానే టిల్లుగా సిద్దూ మరోసారి చెలరేగిపోయాడు. అలాగే హై ఎనర్జీ, మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. అలవోకగా టపోరి లాంగ్వేజ్‌లో డైలాగ్స్ చెప్పిన విధానం.. సినీ అభిమానులకు, ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్‌ను సినిమాలో చూస్తే.. ఆమె రోల్‌ను ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌‌లో లిప్ లాక్, మితీమీరిన రొమాన్స్‌తో తప్పు దారి పట్టించారనేది స్పష్టమవుతుంది. సినిమాలో ఓ సీరియస్ రోల్‌లో అనుపమ ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది.

నేహా శెట్టి గెస్ట్ అప్పీయరెన్స్‌తో సర్‌ప్రైజింగ్‌ చేస్తుంది. పాత్రకు తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ.. ఉన్నంత సేపు ఎమోషన్స్, ఫన్ క్రియేట్ చేసింది. ఇక మురళీధర్ గౌడ్, మార్కస్, ప్రిన్స్, బ్రహ్మజీ, మురళీ శర్మ ఇతర క్యారెక్టరు సినిమాకు బోలెండంత వినోదాన్ని, కంటెంట్‌ను అందించారు. కనిపించిన ప్రతీ చిన్న పాత్ర గుర్తుండేలా ఉంటుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు రైటింగ్ఎ అత్యంత బలంగా నిలిచింది. కేవలం డైలాగ్స్, సీన్లను డిజైన్ చేసిన విధానంతోనే డీజే టిల్లు కంటే ఎక్కువ స్ట్రెంత్ కనిపించింది. ఆ తర్వాత మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయట పాటలు అంతగా కిక్ ఇవ్వలేదు కానీ.. సినిమాలో మంచి జోష్‌ను అందించాయి. నిర్మాణ విలువలు మరో హైలెట్ అని చెప్పవచ్చు.

టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే.. కొత్తగా వెతుక్కోవడానికి ఏమీ లేని రుచికరమైన పాత చింతకాయ పచ్చడి. పాతవాసనలు కొట్టొచ్చిన.. దానిని వదలిపెట్టకుండా ఉండేలా వండి వర్చారు.డీజే టిల్లు తర్వాత ఎన్ని అంచనాలు పెట్టుకొని వెళ్లినా వాటన్నింటిని సంతృప్తి పరుస్తుంది. సినిమా మొదలైన తొలి ఫ్రేమ్ నుంచి చివర ఫ్రేమ్ వరకు ఫన్‌తో నవ్వుతూనే ఉంటాం. ఓవరాల్‌గా టిల్లు స్క్వేర్ ఫన్, అండ్ లాఫింగ్ రైడ్స్. లెట్స్ ఎంజాయ్ ఆన్ బిగ్ స్క్రీన్.. డోంట్ మిస్ ఇట్ ఫన్ లవర్.

26
1512 views